Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీపురు పుల్లలాంటి హీరోయిన్ అంటూ నా గురించి పేపర్లో రాశారు: జమున

  • అప్పుడు 'పుట్టిల్లు' చేస్తున్నాను 
  • చాలా సన్నగా .. పుల్లలా వుండేదానిని
  • లావెక్కడం కోసం ఎన్నో ప్రయత్నాలు
అలనాటి మేటి నటీమణి జమున తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. "హీరోయిన్ గా నా ఫస్టు పిక్చర్ 'పుట్టిల్లు' .. అప్పటికి నాకు 15 వెళ్లి 16 వచ్చి వుంటాయి. అప్పుడు నేను సన్నగా పుల్లలా వుండే దానిని. ఈ సినిమా గురించిన కవర్ పేజీ పబ్లిష్ అయింది. దాంతో 'షూటింగ్ స్టార్ట్ అయింది. డాక్టర్ గరికపాటి రాజారావుగారు తన సినిమాలో చీపురు పుల్లలాంటి హీరోయిన్ ను పెట్టారు .. పేరు జమున' అని ఒక పేపర్లో రాశారు.

 దాంతో నేను లావెక్కడం కోసం మా అమ్మగారు చాలా చేసింది. ఈ విషయంలో ఎవరికి తోచిన సలహా వాళ్లు ఇచ్చారు. నాన్ వెజ్ జోలికి వెళ్లే వాళ్లం కాదు గాబట్టి .. మరో విధంగా చేస్తూ వచ్చాము. సమయానికి పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటూ వచ్చాను. ఇక ఎండలో షూటింగ్ చేయవలసి వచ్చినప్పుడు అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్నాను" అని చెప్పుకొచ్చారు.         
jamuna

More Telugu News